గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (10:25 IST)

గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. ఏమైంది?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్ పిట్ట కూత గంటపాటు ఆగిపోయింది. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్య తప్పలేదు. పోస్టింగ్‌లు ఆగిపోయాయి. లాగిన్ కూడా చేయలేకపోయినట్లు యూజర్లు తెలిపారు. 
 
ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయ్యిందని చాలామంది అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. వెంటనే పరిష్కరించినట్లు ట్విట్టర్ తెలిపింది.