ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (12:50 IST)

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అమేజాన్ భార్ ఎక్చ్సేంజ్ ఆఫర్

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో విడుదల చేసింది. ఒప్పో ఆర్‌15 ప్రో పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని ఏర్పాటు చేశారు. 
 
20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను కలిగివుండే ఈ ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్,1 28 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుందని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్‌ను అమేజాన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్‌పై అమేజాన్ భారీ ఎక్చ్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వుంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ పొందవచ్చు