మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:41 IST)

స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారా? వయసుకు మీరిన లక్షణాలు ముందుగానే?

స్మార్ట్ ఫోన్లను తెగ వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి.. నిత్యం స్మార్ట్‌ఫోన్‌‌ను విడిచిపెట్టకుండా ఉంటే పెనుముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. ఫోన్లు, కంప్యూటర్ల తెరల నుంచి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ఎక్స్పోజ్‌ అయితే వయసు మీరిన లక్షణాలు ముందుగానే ముంచుకొస్తాయని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు తేల్చేశారు. 
 
ఎల్‌ఈడీ తరంగాలకు అధికంగా గురైతే మెదడు కణాజాలం దెబ్బతిన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. తుమ్మెదలపై జరిగిన ఈ అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే వెలుగు తుమ్మెదల జీవనకాలాన్ని గణనీయంగా తగ్గించినట్లు కనుగొన్నట్లు ఒరెగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాగ వెల్లడించారు. మానవ కణజాలంతో పోలిఉన్నందునే ఈ కీటక జాతులపై ఎల్‌ఈడీ తరంగాల ప్రభావాన్ని పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా వదిలివేయడం​ సాధ్యం కాని పక్షంలో బ్లూ లైట్‌ ప్రభావాన్ని తగ్గించడం, రెటీనాను కాపాడుకోవడం కోసం సరైన లెన్స్‌లతో కూడిన గ్లాస్‌లు ధరించాలని సూచించారు. బ్లూ ఎమిషన్స్‌ను నిరోధించే స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడాలని కోరారు.