1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (11:14 IST)

యూట్యూబ్‌లో ''యూట్యూబ్ మ్యూజిక్'' కొత్త యాప్.. స్క్రీన్ ఆన్‌లో?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే భారత్‌లోనూ ప్రవేశపెట్టేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది.

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన యూట్యూబ్ నుంచి త్వరలో మ్యూజిక్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే భారత్‌లోనూ ప్రవేశపెట్టేందుకు యూట్యూబ్ సిద్ధమవుతోంది. 
 
యూట్యూబ్‌లో ఇప్పటివరకు పాటలు వినాలంటే మొబైల్ స్కీన్‌ ఆన్‌లో వుండాల్సిందే. ఆఫ్ చేస్తే పాటలు ఆగిపోతాయి. ఇక అలాంటి ఇబ్బంది వుండదు. ఇందుకోసం "యూట్యూబ్ మ్యూజిక్" అనే యాప్‌ను యూట్యూబ్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ యాప్ ద్వారా మనకు కావాల్సిన పాటను వినొచ్చు. స్క్రీన్ ఆన్‌లో ఉంచకుండానే పాటలు వినే సౌలభ్యం ఇందులో ఉంది. 
 
అంతేకాదు స్క్రీన్‌ను లాక్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇతర మ్యూజిక్ యాప్‌లలానే ఇది కూడా పనిచేస్తుంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు కావాల్సిన పాటలను ఆఫ్‌లైన్ చేసుకుని తర్వాత వినొచ్చునని యూట్యూబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.