సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (12:28 IST)

కామోద్రేకముచే బుద్ధి మంతుడనై..?

అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే 
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు: వివేకియైన సా
రంగధనం బదంబులు కరంబులు గోయ గజేసె దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా..
 
అర్థం: పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడయిన సారంగధరుని, తన కామము తీర్చుమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె ఎన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలు సేతులు ఖిండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశములు కనువుగా వర్తింపనివాడెంత బలాఢ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు అనునది అర్థము.