ప్రేమిస్తే ఇలా చేస్తారా...?
ప్రేమ అనేది ఒక అలౌకిక భావన. ప్రేమకు ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ చాలా మంది ఇష్టాన్ని ప్రేమగా భావించి తొందరపడి జీవితంలో తప్పటడుగులు వేస్తుంటారు. మీరు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం అందంగా ముస్తాబవుతారు, అదే ప్రేమిస్తే వారితో ఉన్నప్పుడు అలంకరణపై ద
ప్రేమ అనేది ఒక అలౌకిక భావన. ప్రేమకు ఇష్టానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ చాలా మంది ఇష్టాన్ని ప్రేమగా భావించి తొందరపడి జీవితంలో తప్పటడుగులు వేస్తుంటారు. మీరు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం అందంగా ముస్తాబవుతారు, అదే ప్రేమిస్తే వారితో ఉన్నప్పుడు అలంకరణపై దృష్టి పెట్టరు. మీరు ఎవరినైనా ఇష్టపడితే ప్రతి క్షణం వారితో గడపాలనుకుంటారు, అదే ప్రేమిస్తే వేరే వ్యక్తులతో కూడా సమయం గడపమని వారిని ప్రోత్సహిస్తారు.
మీరు ఎవరినైనా ఇష్టపడితే వారితో ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ వారిని పరిచయం చేయాలనుకుంటారు. మీరు ఎవరినైనా ఇష్టపడితే వారితో బయట వెళ్లాలని కోరుకుంటారు, అదే ప్రేమిస్తే వారితో ఇంట్లోనే ఉండాలనుకుంటారు. ఈ సూచనలతో మీది ప్రేమ లేక ఇష్టమా అనేది మీరే నిర్ధారించుకోవచ్చు.