1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (07:41 IST)

హిజాబ్‌ సెంటిమెంట్‌ను గౌరవిస్తాం : బీహార్ సీఎం నితీశ్ కుమార్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్‌‍కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని బీహార్ ముఖ్యంత్రి నితీశ్ కుమార్ స్పష్టంచేశారు. మతపరమైన సెంటిమెంట్లను తాము గౌరవిస్తామని తెలిపారు. పైగా, తమ రాష్ట్రంలో హిజాబ్ అనేది ఒక అంశమే కాదని ఆయన స్పష్టంచేశారు. అసలు బీహార్‌లో అలాంటి సమస్యే లేదని చెప్పారు. కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.
 
ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ, బీహార్‌లో పిల్లలంతా యూనిఫాం ధరించే స్కూలుకు వస్తారని, ఎవరైనా తమ తలపై ఏదానా ధరించి వచ్చినా దాని గురించి అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అసలు అలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ప్రభుత్వానికి అందరూ సమానమేనని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.