దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ ప్రారంభం
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ నేటి నుండి ప్రారంభమయింది. అందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నేడు కోవిడ్ రెండో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ ఎక్కడ వేసుకున్నారో రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని సూచించారు.
మొదటి డోస్ ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని తెలిపారు. 28 రోజుల తర్వాత రెండో డోస్ వేసుకోవాలని, ఈ నెల 25 లోగా హెల్త్ కేర్ వర్కర్లు, ఐసిడిఎస్ సిబ్బంది మొదటి డోస్ వేసుకోవాలని చెప్పారు.
ఈ నెల 25 తర్వాత వీరికి మొదటి డోస్ వేయబోరని, ఇదే చివరి అవకాశమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా వీరు ఈనెల 25 లోగా వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. ఇతర శాఖల సిబ్బంది మార్చ్ 5 లోగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు.
ఆ తర్వాత వీరికి వ్యాక్సినేషన్ ఉండదని స్పష్టం చేశారు. ఎపి లోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రారంభమయింది. నేడు 19,108 మంది హెల్త్ కేర్ వర్కర్లకఁ కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయనున్నారు.