ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:44 IST)

47 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కాదనడంతో? (video)

rape
మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 16 ఏళ్ల బాలిక తన వివాహ ప్రతిపాదనలను తిరస్కరించినందుకు 47 ఏళ్ల వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. దాడి చేసిన ఓంకార్ తివారీని పోలీసులు అరెస్టు చేశారు.
 
16 ఏళ్ల బాలికపై అతను గాయపరచడం.. ఆమె జుట్టు పట్టి లాగడం.. ఆమెను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడం వంటి అకృత్యాలతో కూడిన దృశ్యాలు వీడియో రూపంలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కాగా తివారీ కిరాణా దుకాణంలో బాలిక పనిచేస్తుందని తెలిసింది. పనిచేస్తున్న బాలికను వేధించడంతో పాటు ఆమెపై దాడికి పాల్పడ్డాడు తివారీ. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
తివారీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె నిరాకరించి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఈ కారణంతోనే ఆమెపై తివారీ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.