బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:53 IST)

లాక్‌డౌన్ ఎత్తివేయడం అనుమానమే అంటున్న బీజేపీ నేత!!

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లోవుండనుంది. ఆ తర్వాత ఈ లాక్‌డౌన్ ఎత్తివేస్తారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మే 15వ తేదీ వరకు మరోసారి పొడగించనున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడగింపు, ఎత్తివేతపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 
 
మరోవైపు, ఈ లాక్‌డౌన్ అంశంపై బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. మే 3వ తేదీ తర్వాత లాక్‌‌డౌన్‌ తొలగిస్తారో, లేదో ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని, ఆ సమయానికి దేశంలోని కరోనా వ్యాప్తిని బట్టి తదుపరి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ అడ్డుకట్టకు రాష్ట్రాలన్నీ ఐకమత్యంతో పోరాటం కొనసాగిస్తున్నాయని, రాజకీయాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారన్నారు. కనీసం మరో యేడాది పాటు దేశంలో బహిరంగ సభలు, సమావేశాలు ఉండక పోవచ్చని ఆయన అంచనా వేశారు.