శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (11:15 IST)

ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి పిహెచ్‌డి అక్కర్లేదు...

ugclogo
యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి పిహెచ్‌డిలను తప్పనిసరి చేయాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నెట్, సెట్, ఎస్‌ఎల్‌ఇటి వంటి పరీక్షలు పోస్ట్‌కు ప్రత్యక్ష నియామకానికి కనీస ప్రమాణాలు అని అధికారులు తెలిపారు.
 
"అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం కోసం PhD అర్హత ఐచ్ఛికంగా కొనసాగుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SLET) ఈ పోస్ట్‌కి నేరుగా రిక్రూట్‌మెంట్ చేయడానికి కనీస ప్రమాణాలుగా మారాయని, ఇవి అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు వర్తిస్తాయని యుజిసి చైర్మన్, ఎం జగదీష్ కుమార్ అన్నారు. 
 
యూజీసీ 2021లో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకానికి కనీస అర్హతగా పీహెచ్‌డీని వర్తించే తేదీని జూలై 2021 నుంచి జూలై 2023 వరకు పొడిగించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు చాలాకాలంగా మూసివేయడం వల్ల పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధన పనులు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా 2021లో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీని తప్పనిసరి చేయడం ప్రస్తుత విద్యా విధానంలో "అనుకూలమైనది కాదు" అని అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి PhD అవసరం లేదని.. యూజీసీ పరీక్షల్లో అర్హత సాధిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చారు.