బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (18:00 IST)

అయ్య బాబోయ్.. శివసేన పార్టీలో చేరడం లేదు : ఊర్మిళ

బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళ మతోండ్కర్ మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా నిర్ధారించారు. పైగా, ఆమెను ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నామినేట్ చేస్తున్నట్టు కూడా వార్తలు చక్కర్లుకొట్టాయి. వీటిపై ఊర్మిళ స్పందించారు. తాను శివసేన పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. 
 
గత 2019లో కాంగ్రెస్ తరపున ఉత్తర ముంబై లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ‌.. త‌ర్వాత ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పింది. తాజాగా ఆమె ఉద్ధ‌వ్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడైన హ‌ర్ష‌ల్ ప్ర‌ధాన్ వెల్ల‌డించిన‌ట్లు ఓ ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
అంతేకాదు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఊర్మిళ పేరును కూడా ప్ర‌తిపాదిస్తూ గ‌వ‌ర్న‌ర్ బీఎస్ కోషియారీకి ఆమె పేరును పంపిన‌ట్లు కూడా అందులో ఉంది. కానీ తాను మాత్రం శివ‌సేన‌లో చేర‌బోవ‌డం లేద‌ని ఊర్మిళ చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో ఊర్మిల రాజకీయ పునఃప్రవేశంపై ఉన్న సందేహం తీరిపోయింది.