సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (13:52 IST)

ఒరిస్సాలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృత్యువాత

car accident
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఎనిమిది మంది చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. 20వ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఆగివున్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాను డ్రైవర్ పరారీలో ఉన్నారు. 
 
ఈ ప్రమాదంలో గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు తారిణిదేవి ఆలయ దర్శకానికి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టింది. తారిణి ఆలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 
 
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.