శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా పాజిటివ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. క‌రోనా ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. ప్ర‌స్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
తనలో వైర‌స్ ల‌క్ష‌ణాలు త‌న‌లో క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆదిత్య‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. వైద్య చికిత్స తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
వ‌ర్చువ‌ల్ రీతిలో ప‌నులు చేస్తున్న‌ట్లు తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు కూడా క‌రోనా సంక్ర‌మించిన‌ట్లు బుధవారం త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.
 
మరోవైపు, తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేశ్ గ‌తంలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. అయితే, ఆయ‌నకు రెండోసారి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో జరిగిన 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గ‌ణేశ్ పాల్గొన్నారు. 
 
ఆ త‌ర్వాతి రోజు నుంచే ఆయ‌న‌లో ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందుతున్న‌ట్లు స‌మాచారం. 
 
కాగా, ఇటీవ‌ల సినీ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి కూడా క‌రోనా సోకింది. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ముంద‌స్తు జాగ్రత్త‌గా ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.