సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:49 IST)

నోటికి పసందైన వంటకం... చైనీస్ స్టయిల్ చికెన్ రోస్ట్

మిరియాలు మెత్తగా పొడి కొట్టుకోవాలి. బంగాళాదుంపలు తొక్కు తీసి ఆరు లేక నాలుగు ముక్కలుగా కోసి పెట్టాలి. కోడి పట్టేంత వెడల్పాటి కళాయి పాత్ర స్టవ్ పైన పెట్టి, నెయ్యిపోసి మరిగాక యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన

కావలసిన పదార్థాలు :
కోడి... ఒకటి
నెయ్యి... ఒక కప్పు
బంగాళాదుంపలు... పావు కేజీ
యాలక్కాయలు... ఐదు
లవంగాలు... ఆరు
దాల్చిన చెక్క... మూడు ముక్కలు
జీడిపప్పులు... పది
ఉప్పు... ఒక టీస్పూన్
మిరియాలు... ఇరవై
 
తయారీ విధానం :
మిరియాలు మెత్తగా పొడి కొట్టుకోవాలి. బంగాళాదుంపలు తొక్కు తీసి ఆరు లేక నాలుగు ముక్కలుగా కోసి పెట్టాలి. కోడి పట్టేంత వెడల్పాటి కళాయి పాత్ర స్టవ్ పైన పెట్టి, నెయ్యిపోసి మరిగాక యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పులు వేసి వేయించాలి.
 
తర్వాత అదే పాత్రలో శుభ్రం చేసుకున్న కోడిని అలాగే (పొట్టలోనివన్నీ తీసివేసి) పెట్టి, ఐదు లేక పది నిమిషాలకొకసారి అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా వేయించాలి. అన్ని వైపులా ఎర్రగా వేగిన తర్వాత అందులోనే మూడు గ్లాసుల నీటిని పోసి తగినంత ఉప్పు వేయాలి.
 
కోడి సగం ఉడికిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. దుంపలు ఉడికిన తర్వాత ఆ పాత్రలో ఒక గ్లాసుడు గ్రేవీ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకాస్త నీటిని పోసి, కాసేపు ఉడికించి... చివర్లో మిరియాల పొడి చల్లి దించేయాలి. సర్వ్ చేసేటప్పుడు కోడిని ముక్కలు కోసి ఇవ్వాలి. అంతే... చైనీస్ స్టయిల్ చికెన్ రోస్ట్ రెడీ అయినట్లే..!