శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:46 IST)

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది.. అంతా కరోనా మాయ..

''రామాయణ్'' మళ్లీ వచ్చేస్తోంది. ప్రజల కోరిక మేరకు ''రామాయణ్‌'' ధారావాహికను పునః ప్రసారం చేస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి రోజూ ఉదయం 9: 10 నిమిషాలకు ఒక ఎపిసోడ్‌, సాయంత్రం 9: 10 గంటలకు డీడీ ఛానల్‌లో రెండు ఎపిసోడ్‌లని ప్రసారం చేయనున్నారట. ట్విట్టర్ నెటిజన్‌ల విజ్ఞప్తులతో హోరెత్తిపోవడంతో ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. 
 
33 ఏళ్ల క్రితం హిందీలో రామానంద సాగర్ తీసిన వీక్లీ సీరియల్ ఇది. 1987లో వచ్చిన ఈ ధారావాహిక ఉత్తరాది రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ప్రతీ ఆదివారం ఉదయం 10 అయిందంటే చాలు `రామాయణ్‌` డబ్బింగ్ సీరియల్ అయినా సరే చిన్నాపెద్దా.. ముసలీ ముతకా అంతా టీవీల ముందు పాతుకు పోయేవారు. 
 
85 వారాల పాటు నిరాటంకంగా సాగిన ఈ సీరియల్ 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌తో పూర్తియింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేయబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు ఇండియా మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్స్ అంతా ''రామాయణ్‌''ని పునః ప్రసారం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.