శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (23:15 IST)

ఆషాఢం అమావాస్య.. రావి చెట్టు కింద దీపం... కొత్త బట్టలు...?

Peepal Tree
ఆషాఢం అమావాస్య రోజున సూర్యుడు దక్షిణాయానంలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే చలి, చీకటి బాగా పెరుగుతాయి. అవి బద్ధకానికి, అనారోగ్యానికి, అజ్ఞానానికి ప్రతీకలుగా పరిగణిస్తారు. వీటిని తొలగించి వెలుగును పంచేవే దీపాలు. అందుకే ఈరోజున దీపారాధాన కచ్చితంగా చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అలాగే ముఖ్యంగా ఆషాఢం అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. శుచిగా స్నానమాచరించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. పూర్వీకులను స్మరించుకోవాలి. అమావాస్య రోజున ఉపవాసం ఉండాలి. రాత్రిపూట పండ్లను లేదా పండ్ల రసాలను మాత్రమే తీసుకోవాలి.
 
ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని విశ్వాసం. ఈ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ పవిత్రమైన రోజున సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి.
 
​చేయకూడని పనులు..
* ఆషాఢ అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించరాదు.
* ఈ పవిత్రమైన రోజున మధ్యాహ్నం రోజున నిద్ర పోకూడదు.
* ఆషాఢ అమావాస్య రోజున షేవింగ్, కటింగ్ వంటివి చేసుకోకూడదు.