మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:54 IST)

మంగళవారం రోజున ఇలాంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది (video)

Tuesday
మంగళవారం పూట ఆరోగ్యానికి, ఉద్యోగానికి సంబంధించిన శుభ ప్రయత్నాలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మంగళవారం మాంసాహారానికి దూరంగా వుండటం మంచిది. మంగళవారం మాంసాన్ని తీసుకునే వారింట శ్రీ మహాలక్ష్మీ దేవి నివాసం వుండదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషులు మంగళవారం పూట మద్యం సేవిస్తే.. వారి స్వభావంలో మార్పు తప్పదని చెప్పారు.
 
మంగళవారం పూట ఇంట్లో గొడవలు అస్సలు వుండకూడదు. మంగళవారం ఘర్షణలు ఇంటి యజమాని శక్తిని తగ్గిస్తుంది. మంగళవారం పూట ఘర్షణలు, గొడవలకు దూరంగా వుండటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దంపతులు మంగళ, శుక్రవారాల్లో వాగ్వివాదాలకు దూరంగా వుండటం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
అయితే.. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...
 
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్''
 
ఈతిభాదలు తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు పూజామందిరంలో రంగు ముగ్గులు వేసి, వాటిపే దీపాలు వెలిగించుకోవాలి. ఇలా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చేస్తే అమ్మవారు తప్పకుండా సిరిసంపదలను ప్రసాదిస్తారని విశ్వాసం.