శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

ఆర్థిక ఇబ్బందులను తొలగించే కర్పూరం, లవంగాలు.. ఎలా?

కర్పూరం నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెప్తున్నారు. మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయని పండితులు అంటున్నారు. అలానే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోవాలంటే పసుపు, కర్పూరాన్ని కలిపి దుర్గా మాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. 
 
అదే ఆర్థికంగా బాధ పడేవారు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చాలి. తర్వాత వాటిని నిద్ర పోయే ముందు బయట పడేయాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా బాధలు ఏమైనా ఉంటే పోతాయి. అలానే ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కర్పూర దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం నుంచి వచ్చే పొగ ఇంట్లో మొత్తం వ్యాపించేలా అంతటా తిరగాలి. ఇలా నిత్యం చేస్తే ఆర్థిక సమస్యలు మీ దరిచేరవు. 
 
అంతేకాదు రాహు కేతు సమస్యలు దూరం కావాలన్నా ఇంట్లో ప్రతి రోజు కర్పూర హారతి వెలిగించాలి. అంతేకాదు  నీటిలో  కర్నూర తైలాన్ని వేసి స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని.. ఒత్తిడి సమస్యలు దూరమవుతాయి. అలాగే మన జీవితంలో ఎల్లప్పుడూ శుభాలే జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.