29-09-2019 ఆదివారం దినఫలాలు - స్త్రీల కోరికలు, అవసరాలు..

astro 4
రామన్| Last Updated: ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (08:25 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. హోల్‌‌‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. పనులు మొదలెట్టే సమయానికిఆటంకాలు ఎదురవుతాయి. గృహంలో మరమత్తులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఖర్చులు అంచనాలను మించుతాయి.

వృషభం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. పెద్దలతో సంభాషించేటపుడు మెలకువ అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల అనుకూలిస్తాయి.

మిధునం: వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు అపరిచితులతో మెళుకువ అవసరం. వాతావరణంలో మార్పు వల్ల మీ పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి.

కర్కాటకం: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నోరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రావలసిన ధనం అందటం వల్ల తాకట్టు వస్తువులను విడిపిస్తారు.

సింహం: రాజకీయనాయకులకు ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ చాలా అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.

కన్య: చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. విందులలో పరిమితి పాటించండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయటం క్షేమ దాయకం. మీ బంధవులను సహాయం ఆర్థిచేబదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ట్రాన్స్ పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు.

తుల: ఫాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు. విందులలో పరిమితి పాటించండి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. పరిచయంలేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం.

వృశ్చికం: మీ సోదరుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టిసారించండి.

ధనస్సు: ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం ప్రయాణాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.

మకరం: స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గృహమునకు కావలసిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.

కుంభం: ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ప్రముఖుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మనస్సు మార్పుకు కోరుకుంటుంది. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం.

మీనం: కిరణా, ఫ్యాన్సీ, పండ్ల, పూల, వ్యాపారులకు శుభదాయకం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.దీనిపై మరింత చదవండి :