మేషం: శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. శ్రీమతి లేక శ్రీవారి ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పురాలోచన మంచిది.
వృషభం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాభివృద్ధి కానవచ్చిన, పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యతల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
మిధునం: వ్యాపారాలకు కొత్త కొత్త పథకాలు, ప్రణాలికలు రూపొందిస్తారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. తలపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
కర్కాటకం: స్ధిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. రవాణా రంగాలవారికి మెళుకువ అవసరం. ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళుకువ అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు.
సింహం: ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్తీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. బిల్లులు చెల్లిస్తారు. మీ అభిప్రాయాలను, ఆలోచనలను బయటికి వ్యక్తం చేయకండి.
కన్య: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు, షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం.
తుల: నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఉమ్మడి ఆర్ధిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. రుణ యత్నాలు, చేబదుళ్ళుతప్పవు. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని ప్రతికూలత లెదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
వృశ్చికం: ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి అనుకున్న పనుల్లో ఆటంకాలు తప్పవు. రావలసిన బాకీలు సకాలంలో అందుట వల్ల ఆర్ధిక ఇబ్బంది అంటూ ఉండదు. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
ధనస్సు: ఉద్యోగస్తులు స్దానమార్పిడికై చేయు యత్నాలు అనుకూలించవు. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తారు. బంధు, మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రైవేటు సంస్ధలలోని వారికి లౌక్యం అవసరం.
మకరం: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదనే చెప్పవచ్చు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ చాలా అవసరం. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు గృహోపకరణాలకు విలువైన వస్తువులను కొనుగోలుకై చేయు యత్నాలు వాయిదా పడతాయి.
కుంభం: శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
మీనం: స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. కోర్టు వ్యవహారాలు కొత్తమలుపు తిరుగుతాయి. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది.