బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (08:42 IST)

మంగళవారం రాశిఫలితాలు.. స్త్రీలతో పరిచయాలు...

మేషం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు వ

మేషం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. మీ ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు వంటివి ఎదుర్కొంటారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది.
 
వృషభం : గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా సమసిపోతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలుంటాయి. మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
మిథునం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
సింహం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శనాల్లో చికాకులు తప్పవు.
 
కన్య : దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
తుల : నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. ఇతరులకు పెద్ద మొత్తాలు ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
వృశ్చికం : రావలసిన ధనం చేతికందుతుంది. ఉద్యోగస్తులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు ఆకస్మికంగా వాయిదాపడతాయి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలు తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం.
 
ధనస్సు : రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రుణాలు తీరుస్తారు.
 
మకరం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కుంభం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది.
 
మీనం : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. దైవ, సేవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమైన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి.