శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (22:12 IST)

మహామృత్యుంజయ మంత్రం- తాత్పర్యము

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనమ్
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
 
ఓం- పరమాత్ముని ప్రధాన నామం, త్ర్యంబకం- మూడు కన్నులు కలవాడు, యజామహే- నిష్ఠ చేత పూజిస్తాం, సుగంధిం పుష్టివర్థనమ్- ఆయన మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సుఖశాంతులు ఇవ్వాలి, ఉర్వారుక మివ- కర్బూజా పండు పండి తనకు తాను ఎలాగైతే తీగనుండి వేరవుతుందో అలాగే, బంధనాత్ మృత్యోర్- మృత్యువనే బంధనం నుండి, ముక్షీయ- విడిపించాలి, ముక్తి కల్గించాలి, మామ్- మాకు, అమృతాత్- అమృతాన్నివ్వాలి. 
 
ఓ త్రినేత్రుడా, పరమేశ్వరా, మేము మీ ఉపాసన చేస్తున్నాం. మీ ప్రార్థన మాకు సుఖశాంతులనిస్తుంది. శారీరక, మానసిక పుష్టినిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కల్గిస్తుంది. అన్నిరకాల రోగాల నుండి, దుఃఖాల నుండి, వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది. దోస తీగ నుండి ఎలాగైతే వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుంచి వేరు చేసి మోక్షాన్నివ్వు.