శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (11:59 IST)

సుఖప్రసవం కోసం గర్భిణీ మహిళలు ఈ మంత్రాన్ని పఠిస్తే?

Pregnant
గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కోసం ఓ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రస్తుతం సాంకేతిక పెరిగినా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం సుఖ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో సిజేరియన్లకు చెక్ పెట్టాలంటే.. వైద్యులకు సులువుగా మారే సుఖ ప్రసవం కోసం ఈ మంత్రాన్ని ఉచ్ఛరించినట్లైతే శుభ ఫలితాలుంటాయి. 
 
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృమూర్తి ఇంకో ప్రాణాన్ని ఈ లోకానికి ఇస్తోంది. ఆ కాలంలో 95శాతం సుఖ ప్రసవాలే జరిగేవి. కానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్యే పెరుగుతోంది. అయితే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా గర్భిణీ మహిళలకు సుఖప్రసవం జరిగే ఆస్కారం వుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఆ మంత్రం ఏంటంటే?
హే, శంకర, స్మరహర, భ్రమాదినాద 
మన్నాద శాంభవ శశి శూడ హర త్రిశూలిన్ 
శంభో సుఖప్రసవైకృత్ భవ మే దయాళో
శ్రీ మాతృభూత శివ పాలయమామం నమస్తే!
 
ఓ మహిళ గర్భం ధరించిన తర్వాత రోజూ మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే.. సుఖ ప్రసవంతో పాటు.. జన్మించే శిశువు ఆరోగ్యంతో, జ్ఞానంతో జన్మిస్తుందని పండితుల వాక్కు. అలాగే సుఖ ప్రసవం తర్వాత శివునికి అరటి గెడ, ఆవు పాలను సమర్పించుకుంటే.. సకల సంతోషాలు చేకారుతాయి.