మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (16:10 IST)

కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే మంచిదే...

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనక్టయి ఉంటాయి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక నమ్మకాలు కనక్టయి ఉంటాయి. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అలాగే కాకి గురించి కూడా చాలానే ఉన్నాయి.
 
మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పని విజయం సాధిస్తారన్నదే సంకేతం. నీళ్ళు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. 
 
కాకి మాంసం ముక్కను పట్టుకెళుతూ కింద ఏ వ్యక్తిపైనా పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ, లేకుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారు సమస్యల్లో పడతారు. ఒక వ్యక్తి తలమీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళోగాని, తలపై గానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుంచి చూస్తే ద్రవ్యలాభం పొందుతారు. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిష్యులు చెబుతున్నారు.