శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 28 సెప్టెంబరు 2017 (22:40 IST)

మంగళవారం తలస్నానం చేస్తే...

సాధారణంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి మూడుసార్లు మాత్రమే చేస్తుంటారు. జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల ఆడవారు తలస్నానం చేయరు అని మనం అనుకుంటాం. కానీ జ్యోతిష్యులు చెప్పేదాన్ని బట్టి తలస్నానం కొన్నిరోజులు చేస్తే మ

సాధారణంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి మూడుసార్లు మాత్రమే చేస్తుంటారు. జుట్టు ఎక్కువగా ఉండడం వల్ల ఆడవారు తలస్నానం చేయరు అని మనం అనుకుంటాం. కానీ జ్యోతిష్యులు చెప్పేదాన్ని బట్టి తలస్నానం కొన్నిరోజులు చేస్తే మంచిది.. మిగిలిన రోజులు చేస్తే మంచిది కాదని చెబుతుంటారు. 
 
ఆడవారు శుక్ర, బుధవారం మాత్రమే తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే ఐశ్వర్యం, ఐదోతనం రెండూ మెండుగా ఉంటాయి. శని, ఆదివారాల్లో స్నానం చేస్తే మిశ్రమ ఫలితాలు ఉంటుంది. ఈ రోజుల్లో మంచి ఫలితాలు ఉన్నా అప్పుడప్పుడు అరిష్టాలు తప్పవంటున్నారు. 
 
మగవాళ్ళు మాత్రం బుధ, శనివారాలు తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం స్త్రీలు, పురుషులు ఇద్దరూ తలస్నానం చేయకూడదు. అలా చేస్తే ఏ పని కలిసిరాకపోవడమే కాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది. సోమవారం స్నానం చేస్తే తాపం పెరుగుతుంది. పుట్టినరోజు, పండుగల సమయంలో మంగళవారం వస్తే ఆ రోజు తలస్నానం చేయవచ్చు.