గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (19:27 IST)

నవరాత్రులు: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి? (video)

Navagraha
నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. ఇందులో శరన్నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అలంకరణలతో, తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజించడం ద్వారా నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా శరన్నవరాత్రులు నవమితో ముగుస్తాయి. 
 
ముఖ్యంగా అష్టమి, నవమి తిథిల్లో అమ్మవారి ప్రార్థన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు తిథుల్లో అమ్మవారికి పూజలు చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంకా విడిపోయిన దంపతులు కూడా ఒక్కటవుతారు. దొంగతనం భయం, వస్తువులు వృధా, ద్రవ్యం వృధా వంటివి వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.