గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (21:05 IST)

ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేసినవాణ్ణి ఇంకెన్నడూ నమ్మకు.. శిరిడీ సాయి

శిరిడీ సాయినాధుడు సందేశాలు జీవిత సత్యాలు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేసినవాణ్ణి ఇంకెన్నడూ నమ్మకు. ఒకపూట తిండి దొరకనందుకే అంత ఆరాటపడతావేం..? నేను కొన్ని మాసాల పాటు భోజనం లేకుండా వేపాకు తిని బ్రతికాను.

శిరిడీ సాయినాధుడు సందేశాలు జీవిత సత్యాలు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
 
ఒక్కసారి నమ్మకాన్ని వమ్ము చేసినవాణ్ణి ఇంకెన్నడూ నమ్మకు.
 
ఒకపూట తిండి దొరకనందుకే అంత ఆరాటపడతావేం..? నేను కొన్ని మాసాల పాటు భోజనం లేకుండా వేపాకు తిని బ్రతికాను.
 
జీవితం నీకు ఏవిధంగా ఎదురైనా స్వీకరించు. 
 
ఏ వ్యక్తి నుండి, ఏ వస్తువు నుండి, ఏ సంఘటన నుండి, ఏ ప్రాణి నుండి నువ్వు ఏమీ ఆశించకు.
 
భవిష్యత్తు మనకు ఎలా ఎదురవుతుందో, ఏ రూపంలో తటస్థపడుతుందో మనకు తెలియదు. కాబట్టి భవిష్యత్తు నుండి కూడా ఏమీ ఆశించకు.
 
కొందరు గొప్పవాళ్లు పుడతారు. కొందరికి గొప్పతనం ఆపాదించపడుతుంది. కొందరు గొప్పతనాన్ని సాధిస్తారు. ఆ సాధనకు ప్రయత్నించు.
 
ఎక్కడో దూరంగా మిణుకు మిణుకు మంటున్న అవకాశం కోసం పరుగెత్తడం కన్నా, ముందుగా నీ చేతిలో వున్న అవకాశాన్ని వినియోగించుకో. 
 
ఆధ్యాత్మికత అంటే తన గురించి తను తెలుసుకోవడం. 
 
మనలోని లోపాల వల్ల కష్టాలు కొనితెచ్చుకుని అందుకు మరెవరినో బాధ్యులని చెప్పడం తప్పు.