శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 3 నవంబరు 2021 (22:54 IST)

వధువుకి పట్టుచీర, వరుడికి పట్టు పంచె, ఎందుకు?

పట్టు వస్త్రాలు సానుకూల శక్తిని గ్రహిస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. వ్యాధిగ్రస్థుల శ్వాస, ఓజోన్ పొర నుంచి వచ్చే అపరిశుభ్రమైన పవనాలను పట్టు నియంత్రిస్తుంది. ఆ శక్తులు శరీరానికి తాకనివ్వదు.
 
వివాహానికి దాదాపు వేలాది మంది హాజరవుతారు. వారి నుంచి వచ్చే ప్రతికూల శ్వాసలు వధూవరులను తాకనీయకుండా పట్టు వస్త్రాలు చేస్తాయి. అంటువ్యాధులు సోకకూడదనే కారణం చేత వధూవరులు పట్టు వస్త్రాలు ధరిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది.
 
వివాహానికి పట్టువస్త్రాలను ధరించడంపై జరిగిన పరిశోధనలో పట్టువస్త్రాలను ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని తేలింది. అందుకే శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలు, ఆలయాలకు వెళ్లే సమయంలో పట్టువస్త్రాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది.