బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (22:09 IST)

స్వామి వివేకానంద సూక్తులు....

1. ఆత్మ యెుక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది. 2. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు.

1. ఆత్మ యెుక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది.
 
2. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మెుత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి.... అన్నీ నీలోనే ఉన్నాయి.
 
3. ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది.
 
4. విశ్వాసం, సౌశీల్యం గల ఆరుగురు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి మూడు-ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పని చేసే చెయ్యి.
 
5. వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టు వదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలం.