సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (14:24 IST)

సూర్యోదయం అయినట్లు కలవస్తే..?

సాధారణంగా ప్రతీ మనిషికి కలలు వస్తుంటాయి. ఆ కలల్లో కొన్ని నెరవేరుతాయి. మరికొన్ని నెరవేరవు. కానీ, ఈ కల విషయాన్ని నిజం లేదా అబద్దమా అనుకుంటే.. అది నిజమే అంటున్నారు పండితులు. ఎందుకంటే.. కల అనేది.. మనకు జరగబోయిదాన్ని వివరించడానికి వస్తుందట. కనుక కల రావడం మంచిదే అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. 
 
సూర్యుడు సముద్రం నుండి పైకి వస్తున్నట్లు, సూర్యోదయం అయినట్లు కలలు వచ్చినట్లైతే ధనలాభం, జయం కలుగునని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడుతోంది. ఆకాశంలో సూర్యుని వెలుగు కనిపించినట్లైతే ధనలాభం, ఆరోగ్యం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వర్తకులకు అధికలాభం కలుగును. ఆకాశంలో సూర్యాస్తమయం కనిపించినట్లైతే కీడు, వర్తకులకు అధిక ధననష్టం, యువతీ యువకులకు ప్రేమ వివాహాలకు ఆటంకాలు సంప్రాప్తించును.
 
తమ చుట్టూ సూర్యకిరణాలు కమ్ముకున్నట్లు కలవచ్చినట్లైతే సంఘంలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగును. సూర్యుడు ఎర్రగా కవరు కమ్ముకుని వున్నట్లు కలవచ్చినట్లైతే నేత్రాల వ్యాధులతో బాధపడవలసి వస్తుంది. తలచిన పనులు నెరవేరక అశుభాలు కలుగును. ఏదైనా దొంగతనం కానీ, నేరం కానీ చేసినవారికి ఈ కలవచ్చిన శుభాలు జరుగును.