సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 మార్చి 2024 (19:52 IST)

తులసి వనంలో వున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది?

tulsi
తులసి మొక్క. తులసికి ఆధ్యాత్మికంగా ఎంతటి విశేషమైన ప్రాముఖ్యత వున్నదో తెలుసు. అలాంటి తులసి స్వప్నంలో కనిపిస్తే ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. తులసి మొక్కను చూసినట్లు కల వస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. జీవితంలో శుభదాయకమైన సంఘటనలు జరుగుతాయి. అలాగే తులసి వనంలో నిలబడినట్లు కానీ లేదంటే తులసి మొక్కను నాటుతున్నట్లు కానీ కల వస్తే ఇక మీ బంధం అత్యంత దృఢమైనదిగా మారుతుందని అర్థం.
 
తులసి గింజలు చూసినట్లు కలలో కనిపిస్తే పాజిటవ్ ఎనర్జీ వస్తుందని అర్థం. తులసి గింజలను చూస్తే పనులు అన్నీ సఫలమవుతాయి, మంచి మార్పులతో జీవితం మారిపోతుంది. తులసి ఆకులు తింటున్నట్లు కల వస్తే ఫ్యామిలీ సపోర్ట్ వుంటుంది అని అర్థం. తులసి ఆకులను వాసన చూస్తున్నట్లు స్వప్నం వస్తే మీరు తీసుకునే నిర్ణయాలు మంచివి అని అర్థం. తులసి ఆకులను కోస్తున్నట్లు కల వస్తే సువర్ణవకాశం మీ జీవితంలో వస్తుందని అర్థం.
 
ఐతే ఎండిపోయిన తులసి చెట్టు స్వప్నంలో దర్శిస్తే ధన నష్టం లేదా సమస్యలు వస్తున్నట్లు అర్థం.