మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 26 జులై 2018 (13:49 IST)

ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలో తెలుసా?

ఉదయాన్నే నిద్రలేవగానే ఆవును గాని, అద్దాన్ని గాని, తల్లిదండ్రులను గాని, భార్యనుగాని చూడడం ఒక ఆచారంగా కనిపిస్తుంది. ఈనాటికి కూడా ఈ ఆచారం కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు. పూర్వీకలు ఈ ఆచారాన్ని పాటించడం

ఉదయాన్నే నిద్రలేవగానే ఆవును గాని, అద్దాన్ని గాని, తల్లిదండ్రులను గాని, భార్యనుగాని చూడడం ఒక ఆచారంగా కనిపిస్తుంది. ఈనాటికి కూడా ఈ ఆచారం కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు. పూర్వీకలు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అద్దం లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూస్తే మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది.
 
ఆవు దేవతా స్వరూపమని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆవును చూడడమనేది సమస్త దేవతలను దర్శించినట్లవుతుంది. అర్థాంగి ఎప్పుడు తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. అందువలన ఇంటికి దీపంలాంటి ఇల్లాలి ముఖాన్ని చూడడం అంతా మంచే జరుగుతుందని అంటారు. 
 
మమతలే తప్ప మహిమలు ఎరుగని దేవుళ్లు అమ్మానాన్నలు. అలాంటి అమ్మానాన్నలు తాము ఎలా ఉన్నను తమ బిడ్డలు సంతోషంగా, క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు. కనుక ఉదయం లేవగానే అమ్మానాన్నలని చూడడమనేది లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది.