మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:15 IST)

భక్తులు లేక బోసిబోయిన తిరుమల గిరులు...

మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. కరోనా, లాక్డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించారు. 
 
అయితే, ఇటీవలికాలంలో పెరుగుతున్న కేసులు, మరోమారు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గురువారం నాడు స్వామివారిని కేవలం 16,412 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని, 7,974 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.