శ్రీవారి భక్తులు మీ డబ్బులు రీఫండ్, 2021 డైరీలు, క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో, ఎలా?
లాక్‌డౌన్ కారణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ (tirupatibalaji.ap.gov.in) ద్వారా గానీ, పోస్టాఫీసు, ఇ-దర్శన్ మరియు ఎపి ఆన్లైన్ కౌంటర్ల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది.
ఈ మేరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు మరియు ఎపి ఆన్లైన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివరాలను excel టెక్ట్స్‌లో టైపు చేసి
[email protected] మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది. మెయిల్ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరడమైనది. టిటిడి ముద్రించిన 2021 డైరీలు, క్యాలెండర్లను భక్తులు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించడమైనది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టిటిడి ఒక ప్రకటనలో కోరింది.