ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (12:03 IST)

ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?

romance
ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు. అలాగే కొందరు తమకు నచ్చిన వారిని ప్రేమిస్తుంటారు. ఐతే చాలా సందర్భాల్లో అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలను ప్రేమిస్తుంటారు. కానీ అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారో లేదో తెలియదు. అలాంటివారు తొలుత అమ్మాయితో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరుచుకోవాలి.
 
ఆమె చెప్పేది పూర్తిగా వినాలి
ఆమె మాటకు మీరు కట్టుబడి వుండాలి. అలా చేయడం ద్వారా ఆమెతో క్రమంగా చనువు ఏర్పడుతుంది.
ప్రేయసి-ప్రియుల మధ్య విభేదాలు సహజమే అయినప్పటికీ తప్పు మనది అయినప్పుడు క్షమించమని వేడుకోవాలి. తద్వారా ఆమెకి మీరంటే గౌరవం ఏర్పడుతుంది.
అబద్ధాలు అస్సలు చెప్పవద్దు. ఒక్కసారి నిజం బయటపడితే జన్మలో ఆమె మిమ్మల్ని విశ్వసించదు. మీతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపదు.
మీకు నచ్చని మాటలు అంటే వాదనలకు దిగకూడదు, ఆమెకి అనునయంగా సమాధానాలు చెప్పడం చేయాలి.
 
ఆమెకి అన్నివేళలా తనకు మీరున్నారనే బలమైన విశ్వాసాన్ని కలిగించండి. 
 
ఆమె పైన మీకున్న ప్రేమను మాటలతోనే కాదు సందేశాలతో కూడా చెప్పవచ్చు. కొన్ని సందేశాలు మాటల కంటే చాలా బలంగా వుంటాయి.
ఇన్ని చేసినప్పటికీ ఆమె మీ పట్ల ప్రేమను వ్యక్తపరచడం లేదంటే ఆమెకి మీపై ప్రేమ లేదని తెలుసుకుని స్నేహంగా మాత్రమే వుండటం చేయాలి.