గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (08:32 IST)

టోక్యో ఒలింపిక్స్ : ఆర్చర్ అతాను దాస్ - బాక్సర్ అమిత్ కథ ముగిసింది...

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత ఆర్చ‌ర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్‌ ప్రిక్వార్ట‌ర్స్‌తోనే ముగిసింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన రౌండ్ ఆఫ్ 8లో అత‌డు జ‌పాన్‌కు చెందిన ఫురుకువ త‌క‌హ‌రు చేతిలో 4-6తో ఓడిపోయాడు. 
 
ఐదు సెట్ల పాటు హోరాహోరీగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో అతాను రెండు సెట్లు కోల్పోయి ప‌రాజ‌యం పాల‌య్యాడు. మూడో సెట్‌లో మాత్ర‌మే అతాను గెల‌వ‌గా.. రెండు, నాలుగు సెట్‌ల‌లో ఇద్ద‌రు అథ్లెట్లు ఒకే స్కోరు సాధించారు.
 
అలాగే, భారత్‌కు బాక్సింగ్‌లో ఖచ్చితంగా మెడ‌ల్ తీసుకొస్తాడ‌నుకున్న బాక్స‌ర్ అమిత్ పంగాల్‌కు షాక్ తగిలింది. అత‌డు ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు. కొలంబియా బాక్స‌ర్ మార్టినెజ్ రివాస్‌తో జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్ బౌట్‌లో1-4 తేడాతో అమిత్ ప‌రాజ‌యం పాల‌య్యాడు. 
 
48-52 కేజీల ఫ్లైవెయిట్ కేట‌గిరీలో టాప్ సీడ్‌గా బ‌రిలోకి దిగిన అమిత్‌.. ఈసారి మెడ‌ల్ హాట్ ఫేవ‌రెట్‌ల‌లో ఒక‌డిగా ఉన్నాడు. కానీ అత‌డు క‌నీసం క్వార్ట‌ర్స్‌కు చేరుకోక‌పోవ‌డం తీవ్ర నిరాశ క‌లిగించేదే. బౌట్ మొత్తం అటాకింగ్ కంటే డిఫెన్స్‌కే ప్రాధాన్య‌మిచ్చిన అమిత్‌.. త‌గిన మూల్యం చెల్లించాడు.