జొన్న కేక్ ఎలా చేయాలంటే..?

Last Updated: శనివారం, 16 మార్చి 2019 (15:32 IST)
కావలసిన పదార్థాలు:
జొన్నపిండి - 150 గ్రా
చక్కెర - 70 గ్రా
అరటిపండ్లు - 3
గుడ్లు - 3
డాల్డా - అరకప్పు
పాలు - అరకప్పు
ఎసెన్స్ - నాలుగు చుక్కలు
ఉప్పు - సరిపడా.

తయారీ విధానం:
ముందుగా జొన్నపిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, సోడా కలిపి జల్లించుకోవాలి. తరువాత చక్కెరలో డాల్డా కలిపి క్రీమ్ చేసుకోవాలి. ఆపై కోడిగుడ్లని బాగా గిలకొట్టి క్రీమ్‌కి నిదానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, అరటిపండ్ల పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ గిన్నెలో వేసి 325 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించాలి. ఆపే ఓవెన్‌లో నుండి కేక్‌ని బయటకు తీసి చల్లారిన తరువాత కట్ చేసుకోవాలి. అంతే... జొన్న కేక్ రెడీ అయినట్లే...దీనిపై మరింత చదవండి :