శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (18:15 IST)

టెస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై..?

కావలసిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు - 4
ఉల్లిపాయలు - 1 కప్పు
టమోటాలు - 1 కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ - 1 కప్పు
పచ్చిమిర్చి - 5
కారం - అరస్పూన్
జీలకర్ర - అరస్పూన్
ధనియాల పొడి - అరస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా టమోటాలు, వెల్లుల్లి మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై బాణలిలో నూనె వేడిచేసి అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తరువాత టమోటా మిశ్రమాన్ని వేసి కాసేపు వేయించి అందులో పసుపు, కారం, ధనియాల పొడి కలిపి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న గుడ్డును వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెుత్తం మిశ్రమాన్ని వేగించాలి. చివరగా కొత్తిమీర తరుగును చల్లుకుంటే.. టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ ఫ్రై రెడీ.