శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:45 IST)

గొర్రెల మందను తప్పించబోయి.. ఈటెల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం

etela rajender
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎదురుగా వస్తున్న గొర్రెల మందను తప్పించేందుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఎస్కార్ట్ వాహనం రాజేందర్ వాహనాన్ని ఢీకొట్టింది. 
 
అదృష్టవశాత్తూ, వాహనానికి స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు. సోషల్ మీడియా పుకార్లను పట్టించుకోవద్దని, ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు మానుకోవాలని, ప్రజల ఆశీస్సులు తనను కాపాడాయని చెప్పారు.