దుష్టశక్తులున్నాయంటూ వివాహితపై ఫకీరు అత్యాచారం.. భర్తే ప్రోత్సహించిన వేళ!
హైదారాబాద్ మల్కాజ్ గిరీలో దారుణం వెలుగుచూసింది. దుష్ట శక్తులను పారద్రోలతానని చెప్పి ఓ పకీరు 27 ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అందుకు ఆ మహిళ భర్తే సహకరించడం దారుణమైన విషయం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పకీరుతో పాటు బాధితురాలి భర్తను అరెస్ట్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్కాజ్ గిరీకి చెందిన ఓ వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి 5 లక్షల అప్పు ఉంది. అది తీర్చడానికి ఎంత కష్టపడ్డా వర్కవుట్ అవ్వడం లేదు.
దీంతో అతడు నాంపల్లికి చెందిన మహ్మద్ యూనిస్ ఖాన్ అనే ఫకీరును ఆశ్రయించాడు. అతడు దుష్ట శక్తుల ఆవాహన వల్లే ఇదంతా జరుగుతుందని, వాటిని వదిలిస్తానని చెప్పాడు.
ఆ తర్వాత డ్రైవర్ అతని భార్యతో కలిసి మౌలాలిలో ఉన్న స్నేహితుడి ఇంట్లో ఫకీరును మళ్లీ కలిశారు. అక్కడ దుష్టశక్తులను తరిమే పూజలో భాగంగా దుస్తులు విప్పాలని డ్రైవర్ భార్యను ఆదేశించాడు ఫకీరు.
అందుకు ఆమె తిరస్కరించగా..భర్త వారించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నగ్నంగా మారింది. ఆ తర్వాత ఫకీరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీనిపై పోలీసులను ఆశ్రయించింది వివాహిత. పోలీసులు ఫకీరుతో పాటు బాధితురాలి భర్తను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.