సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 మార్చి 2021 (16:51 IST)

పని ఇస్తానని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం

పని ఇస్తానని రాజమండ్రి నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసి తన నివాసంలో బంధించిన 35 ఏళ్ల వ్యక్తిని బుధవారం బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
నిందితుడు పి ఉదయ్ భాను బాధితురాలిని రాజమండ్రి నుంచి కొన్ని నెలల క్రితం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇక అప్పట్నుంచి ఆమెపై అత్యాచారం చేస్తూ తన నివాసంలో బంధించాడు. బయటకు వెళ్లే మార్గంలేని బాధితురాలు చివరికి తన మైనర్ కుమార్తెను సంప్రదించగలిగింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.