సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (11:39 IST)

మంచిర్యాలలో అంబులెన్స్ మాఫియా : రూ.80 వేలు అద్దె డిమాండ్

deadbdoy
తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతుంది. మొన్నటికిమొన్న ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా ఓ వ్యక్తి కన్నబిడ్డ శవాన్ని ఏకంగా 90 కిలోమీటర్ల దూరం బైకులో తీసుకెళ్లాడు. తాజాగా తెలంగాణాలోని మంచిర్యాలలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. 
 
ఆస్పత్రిలో చనిపోయిన మృతదేహాన్ని మంచిర్యాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఓ వ్యక్తి సోదరుడి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన హృదయ విదారకంగా మారింది. 
 
ఈ ఘటన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోతీషాగా గుర్తించారు, వడదెబ్బ కారణంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించారు.
 
మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అతని సోదరుడు ప్రైవేట్ అంబులెన్స్‌లను సంప్రదించగా వారు రూ.80,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. 
 
అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ మృతదేహాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే వెసులుబాటు తమకు లేదని తెలిపారు.