మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (20:04 IST)

మాస్ స్టెప్పులు వేస్తూ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి

Malla Reddy
Malla Reddy
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ మంత్రి మల్లారెడ్డి యువతతో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు. పాలమ్మిన పూలమ్మిన అంటూ తన డైలాగ్ చెప్తూ అందరినీ అలరించారు. 
 
70 ఏళ్లు వచ్చినా నిత్య యువకుడిలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. వరల్డ్ హార్ట్ డేలో భాగంగా హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 
 
స్టేజ్ పైన డీజే టిల్లు టైటిల్ సాంగ్ రాగానే అక్కడున్న వారితో ఆయన హుషారుగా డ్యాన్స్‌ చేశారు. అనంతరం స్టేజ్ కిందకు వచ్చి అందరితో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.