శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (09:27 IST)

తెలంగాణాలో బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్టు

arrested
తెలంగాణా రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం పనామా గోడౌన్స్ దగ్గర గురువారం అర్థరాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనామా గోడౌన్ల వద్ద జిట్టా బాలకృష్ణ అనుచరులను పోలీసులు ఆపి నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభ్యంతరకర స్కిట్‌లు పెట్టారంటూ జిట్టా బాలకృష్ణారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ తర్వాత బీజేపీ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అరెస్టును తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.