బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (09:22 IST)

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా.. డేంజర్ బెల్స్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2వేల 331 కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురము, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత విశాఖపట్నంలో 298మంది, చిత్తూరు జిల్లాలో 296 మందికి కరోనా సోకింది.
 
తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఒక్క రోజులో దాదాపు రెండు వేల మందికి వైరస్‌ సోకింది. ఐదుగురు కరోనాకు బలయ్యారు. తెలంగాణలో మొత్తం 11వేల 617యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 393మంది కరోనా బారిన పడ్డారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ వారం రోజుల్లోనే 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయ్‌. కరోనాపై మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ.

అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని మంత్రి ఈటెల చెప్పుకొచ్చారు. కరోనా తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి ఉందని తెలిపారు.