ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:23 IST)

మరో నాలుగు మండలాలకు దళిత బంధు విస్తరణ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేయాలని అధికారులకు సూచించింది. 
 
రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి... ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్​తో పాటే దళితబంధు అమలు చేయనున్నారు. 
 
ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు అమలు అవుతుండగా... ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారగొండ మండలంలో, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అమలు చేయాలని సూచించింది.