మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:28 IST)

‘వాట్సాప్ ఛానల్’ను ప్రారంభించిన తెలంగాణ సీఎం కార్యాలయం

telangana state
తెలంగాణ ప్రభుత్వం అధునాతన టెక్నాలజీ మీడియా, ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ‘వాట్సాప్ ఛానల్’ను ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా, ప్రభుత్వం CMO నుండి పౌరులకు ప్రకటనలను ప్రసారం చేస్తుంది. తెలంగాణ CMO వాట్సాప్ ఛానల్ ముఖ్యమంత్రి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CMPRO) కార్యాలయంతో సమన్వయంతో IT డిపార్ట్‌మెంట్ డిజిటల్ మీడియా విభాగంచే నిర్వహించబడుతుంది.
 
దీని కోసం ముఖ్యమంత్రి కార్యాలయం (తెలంగాణ సిఎంఓ) వాట్సాప్ ఛానెల్‌ని ఉపయోగించడం ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు సీఎం కెసీఆర్ వార్తలను తెలుసుకోగలుగుతారు. ఆసక్తి ఉన్నవారు క్రింద సూచించిన పద్ధతిలో CMO ఛానెల్‌లో చేరవచ్చు.
 
WhatsApp అప్లికేషన్ తెరవండి.
మొబైల్‌లో అప్డేట్స్ సెక్షన్ ఎంచుకోండి. 
డెస్క్‌టాప్‌లో "ఛానెల్స్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
తర్వాత " +"  బటన్‌పై క్లిక్ చేసి, “ఫైండ్ ఛానల్స్” ఎంచుకోండి.
టెక్స్ట్ బాక్స్‌లో ‘తెలంగాణ CMO’ అని టైప్ చేసి, జాబితా నుండి ఛానెల్‌ని ఎంచుకోండి. 
ఛానెల్ పేరు పక్కన గ్రీన్ టిక్ మార్క్ ఉండేలా చూసుకోండి.
ఫాలో బటన్‌ను క్లిక్ చేసి, తెలంగాణ CMO ఛానెల్‌లో చేరండి. 
నేరుగా వాట్సాప్‌లో సీఎంఓ పంపిన ప్రకటనలను చూడండి.
పైన ఇచ్చిన QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పౌరులు కూడా తెలంగాణ CMO WhatsApp ఛానెల్‌లో చేరవచ్చు.