శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (16:34 IST)

తెలంగాణ సర్కారు నుంచి మరో నోటిఫికేషన్.. 24 పోస్టుల భర్తీ

Jobs
తెలంగాణ సర్కారు నుంచి తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఫుడ్సఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను జనరల్ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. 
 
ఈ నెల 29 నుంచి ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 
 
దీనికి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. గ్రూప్ -4 జాబితాపై త్వరలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.