శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఈ నెల 25 నుంచి 30 వారాంతపు ప్రత్యేక రైళ్ళు

train
తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 25వ తేదీ నుంచి 30 వారాంతపు ప్రత్యేక రైళ్ళను నడపాలని రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, వడియారంలో రైల్వే టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, హైదరాబాద్‌ - తిరుపతి - హైదరాబాద్‌, కాచిగూడ - నర్సాపూర్‌, నర్సాపూర్‌ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ స్టేషన్ల మధ్య జులై 25 నుంచి ఆగస్టు 31 మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.
 
రంగారెడ్డి జిల్లా చేగూరులో జరిగే అంతర్జాతీయ ధ్యాన కార్యక్రమం నేపథ్యంలో 21, 23 తేదీల్లో చెంగల్పట్టు - కాచిగూడ, యల్హంక - కాచిగూడ, ముంబై సీఎస్‌టీ - భువనేశ్వర్‌, రాజ్‌కోట్‌ - సికింద్రాబాద్‌ రైళ్లు వికారాబాద్‌లో ఆగుతాయి. 
 
25, 26ల్లో కాచిగూడ - చెంగల్పట్టు రైలు షాద్‌నగర్‌లో, భువనేశ్వర్‌ - ముంబై సీఎస్‌టీ, సికింద్రాబాద్‌ - రాజ్‌కోట్‌ రైళ్లు వికారాబాద్‌లో ఆగనున్నాయి. మరోవైపు, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరభివృద్ధి కోసం పిలిచిన టెండర్ల బిడ్లను ఈ నెల 29న తెరవనున్నారు.  అలాగే, సికింద్రాబాద్‌, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ సమీక్షించారు.